Dussehra Holidays 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా సెలవులను అదనంగా మరో రెండు రోజులు పొడిగించింది. దీంతో ఇప్పుడు మొత్తం 11 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు రానున్నాయి.
సెలవులపై క్లారిటీ
మొదటగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులను అక్టోబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు ప్రకటిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం మొత్తం 9 రోజుల సెలవులు ఉండాలి. అయితే, ఉపాధ్యాయులు ఈ సెలవులను అక్టోబర్ 22 నుంచే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయుల విజ్ఞప్తిని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.
లోకేష్ చొరవతో సెలవుల పొడిగింపు
ఉపాధ్యాయుల విజ్ఞప్తిపై మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. విద్యాశాఖ అధికారులతో చర్చించిన అనంతరం సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా పండుగ సెలవులు ఉంటాయని తెలిపారు. ఈ నిర్ణయంతో, ఇప్పుడు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు మొత్తం 11 రోజుల పాటు దసరా సెలవులను ఆస్వాదించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఈ సెలవుల పొడిగింపు నిర్ణయంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించాం. pic.twitter.com/SpUJldmwiH
— Lokesh Nara (@naralokesh) September 19, 2025