Srisailam: శ్రీశైలంలో దసరా మహోత్సవాలు పది రోజుల పాటు కన్నులపండువగా వైభవోపెతంగా జరిగాయి పదోవరోజు అమ్మవారు నిజాలంకరణ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు భ్రమరాంబాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు వేదపండితులు వేదమంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు అమ్మవారి ఆలయ పక్కన ప్రత్యేక వేదికపై పూజలు నిర్వహించి అలానే నందివాహనంపై ఉన్న శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి శ్రీస్వామి అమ్మవారిని ఊరేగింపుగా శమి వృక్షం వద్దకు తీసుకొచ్చి జమ్మి వృక్షానికి అర్చకులు,ఈవో పెద్దిరాజు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు పూజలు పూర్తవగానే భక్తులు భక్తి భావంతో పోటీ పడి శమీ ఆకులను తెంచుకుని విజయానందంతో శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకొని వెళ్లారు విజయదశమి రోజున శమీ ఆకులను పొందుతే విజయం పొందుతామని భక్తుల ప్రగాఢ నమ్మకం శమీ పూజల అనంతరం దసరా ముగింపులో భాగంగా ఆలయ పుష్కరిణిలో వైభవంగా శ్రీస్వామి అమ్మవార్ల తెప్పోత్సవం నిర్వహించారు ప్రత్యేక తెప్పపై ఆదిదంపతులు విహారాన్ని చూస్తూ భక్తి భావంతో పులకించిన భక్తులు,స్థానికులు ఆలయ పుష్కరిణి ప్రాంగణమంత భక్తుల శివనమస్మరణతో మారుమోగింది నేటితో శ్రీశైలంలో దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ముగిశాయి.

