Kaantha: దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం కాంత బాక్సాఫీస్ దగ్గర సాదాసీదా ప్రదర్శన కనబరిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ డిసెంబర్ 12 నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
దుల్కర్ సలర్ సల్మాన్, భాగ్యశ్రీ బొర్సె, సముద్రఖని కీలక పాత్రల్లో నటించిన కాంత చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో దుల్కర్, భాగ్యశ్రీల నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. ప్రత్యేకంగా రానా దగ్గుబాటి నిర్వహించిన కాప్ పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం డిసెంబర్ 12 నుంచి తెలుగు, తమిళంతో పాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన కాంత.. ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని నమోదు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

