Dude: ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ సినిమా దీపావళి బరిలో దూసుకెళ్తోంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.80 కోట్ల క్లబ్ లో చేరి, బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది.
Also Read: Ram-Bhagyashri: రామ్-భాగ్యశ్రీ లవ్ స్టోరీ.. కన్ఫర్మ్?
ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేశారు. యూత్‌కు కనెక్ట్ అయ్యే కంటెంట్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీపావళి సెలవులు కలిసొచ్చి, నాలుగు రోజుల్లో రూ.83 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. థియేటర్లలో జనం క్యూ కట్టడంతో ఈ చిత్రం రూ.100 కోట్ల మార్క్‌ను తాకుతుందా అనే ఆసక్తి నెలకొంది. దీపావళి బరిలో ఇతర చిత్రాలతో పోటీపడుతూ డ్యూడ్ ధీటుగా దూసుకెళ్తోంది. ప్రదీప్ నటన, కథనం, సంగీతం సినిమాకు బలంగా నిలిచాయి. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం ఆకర్షిస్తూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో వరుసగా 100 కోట్ల హిట్లు అందుకున్న ప్రదీప్.. డ్యూడ్ తో హ్యాట్రిక్ 100 క్రొర్ హిట్ అందుకుంటాడో లేడో చూడాలి.