Greta Thunberg: గాజాకు మానవతా సహాయం అందించేందుకు ప్రయాణిస్తున్న అంతర్జాతీయ ఫ్లోటిల్లా నౌకపై ట్యునీషియా తీరంలో మంగళవారం ఉదయం జరిగిన పేలుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌తో పాటు 44 దేశాలకు చెందిన ప్రతినిధులు ప్రయాణిస్తున్న గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా (GSF) నౌకలో ఈ ఘటన చోటుచేసుకుంది. నౌకకు పోర్చుగీస్ జెండా ఉండగా, అందులో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ గాయపడకపోవడం గమనార్హం.
GSF విడుదల చేసిన అధికారిక ప్రకటనలో “ఫ్యామిలీ బోట్” పేరుతో ఉన్న ప్రధాన నౌకలో పేలుడు సంభవించిందని ధృవీకరించింది. “ఈ దురాక్రమణ చర్యలు మమ్మల్ని భయపెట్టలేవు. గాజా ప్రజల పట్ల సంఘీభావం వ్యక్తం చేస్తూ, ముట్టడిని విచ్ఛిన్నం చేయాలనే మా శాంతియుత ప్రయత్నం కొనసాగుతుంది” అని సంస్థ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Asia Cup 2025: ఆసియా కప్ .. అన్ని జట్లు ఇవే
అయితే డ్రోన్ దాడి జరిగిందనే ఆరోపణలను ట్యునీషియా అధికారులు తోసిపుచ్చారు. నేషనల్ గార్డ్ ప్రతినిధి “ప్రాథమిక దర్యాప్తులో నౌక లోపలి నుంచే పేలుడు సంభవించినట్లు తేలింది. డ్రోన్ దాడి జరగలేదు” అని తెలిపారు.
ఘటన సమాచారం తెలిసిన వెంటనే ట్యునీషియాలోని సిడి బౌ సయీద్ ఓడరేవు వద్ద స్థానిక ప్రజలు భారీగా గుమికూడి పాలస్తీనా జెండాలను ఊపుతూ నినాదాలు చేశారు.
2007లో హమాస్ గాజాపై అధికారం స్వాధీనం చేసుకున్న తర్వాత, ఇజ్రాయెల్ ఆ ప్రాంతంపై నావికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తోంది. 2023 అక్టోబర్‌లో హమాస్ దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి చేసిన తర్వాత ప్రస్తుత ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇప్పటివరకు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 64,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం కారణంగా గాజా ప్రాంతంలో ఆహార కొరత తీవ్రరూపం దాల్చిందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరించాయి.
🚨 BREAKING: Greta Thunberg was aboard a Gaza aid ship hit by a suspected drone strike off the coast of Tunisia.
The vessel, carrying activists and humanitarian supplies, was set ablaze mid-mission.
Attacking aid workers is not war, it’s terror. pic.twitter.com/Q2iBQ0FLgQ
— Brian Allen (@allenanalysis) September 9, 2025