Hyderabad: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ప్రతిష్ఠాత్మకమైన కేబీఆర్ పార్కు ఎంట్రీ ఫీజును పెంచుతూ అటవీ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదేశాలను జారీ చేశారు. గతంలో ఉన్న ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతోపాటు గతంలో పాస్ లు ఉన్నవారు ఈ నెల 31లోగా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు.
Hyderabad: కేబీఆర్ పార్కు ఎంట్రీ పాస్ జనరల్ క్యాటగిరీ కింద గతంలో రూ.3,100 ఉండగా, దానిని రూ.3,500కు పెంచారు. అదే విధంగా సీనియర్ సిటిజన్స్‌కు రూ.2,100 ఉండగా దానిని రూ.2,500కు పెంచారు. పాఠశాల వార్షిక ఎంట్రీ పాస్‌లను కూడా ఆన్‌లైన్‌లో రెన్యువల్ చేసుకోవాలని అధికారులు సూచించారు.