Viral News: ఆదివారం వచ్చిందంటే చాలా ఇండ్లల్లో ఘుమఘుమల మాంసాహారం రుచి చూడాల్సిందే. ముక్కలేనిదే ఆదివారం ముద్ద దిగని పరిస్థితి. తెల్లారే సరికి చికెన్, మటన్, చేపల దుకాణాల వద్ద క్యూలు కడుతుంటారు. సెలవు రోజు కావడంతో ఇంటిల్లిపాదీ లాగించేస్తుంటారు. ఆదివారమే కాదు.. ఏవారమైనా చికెనో, మటనో తినడం సర్వసాధారమై పోయిందనుకోండి.
Viral News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల పట్టణం సమీపంలోని ఎస్ కొత్తూరు గ్రామంలో ఆదివారం మాత్రం మాంసాహారం ముట్టనేముట్టరు. ఇది ఒకటి, రెండు నెలలు ఏండ్లు కాదు.. వందల ఏండ్ల నుంచి ఆ ఊరిలో ఇదే సంప్రదాయం కొనసాగుతున్నది. ఆదివారం రోజంతా ఆ ఊరి ప్రజలు మాంసం తినరు, మద్యం ముట్టరు. అందరి ఇండ్లలో ఈ సంప్రదాయాన్ని తప్పక పాటిస్తూ వస్తున్నారు. పూర్వం నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఆధునిక తరం కూడా ఆచరిస్తున్నది.
Viral News: ఎస్ కొత్తూరు గ్రామంలో 400 ఏండ్ల క్రితం ఓ పొలంలో ఓ రైతుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని ఊరంగా పరమ పవిత్రంగా భావించారు. దానికోసం ఓ గుడినే కట్టించారు. అప్పటి నుంచి ఆ ఊరంతా ఆ స్వామికి మొక్కులు చెల్లించుకుంటూ వస్తున్నది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆదివారం ప్రీతికరమైన రోజని ఆ ఊరి ప్రజలు భావిస్తూ వస్తున్నారు. అందుకే ఆదివారం రోజు మద్యం, మాంసం ముట్టరు.
Viral News: ఆ ఊరిలో ఆదివారం ఎవరైనా మరణించినా అంత్యక్రియలు నిర్వహించరు. మరుసటి రోజు వరకు మృతదేహాన్ని ఉంచి ఆ తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తారు. అందుకే ఆదివారం రోజును ఆ ఊరి ప్రజలు అంత పవిత్రంగా భావిస్తూ వస్తున్నారన్నమాట.