Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫార్మా స్యూటికల్, మందుల ధరలను తగ్గించేందుకు కీలక నిర్ణయం ప్రకటించారు. అది రేపటి నుంచి (మే 13) అమలుకు ఆదేశాలను జారీ చేశారు. ఈ మేరకు వాటి ధరలు 30 నుంచి 80 శాతం వరకు తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఈ విషయాన్ని తన ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు.
Donald Trump: ఇతర దేశాల్లో ఫార్మా స్యూటికల్, మందుల ధరలను పెంచడం ద్వారా ఆ నష్టాన్ని భర్తీ చేస్తామని ప్రకటించారు. ఫార్మా కంపెనీలు ఇతర దేశాల్లో కంటే అమెరికాలో 10 రెట్లే అధిక ధరలకు మందులను విక్రయిస్తున్నాయి. మే 13 నుంచి దీనిని మార్చబోతున్నాం.. అంటూ ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు.