Alcohol: మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సాధారణంగా మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ దాన్ని ఎవరు సరిగ్గా పాటించారు.అయితే బీరు సరైన మోతాదులో తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఎక్కువగా యువత బీరు తాగడానికి ఇష్టపడతారు. అయితే, బీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ బీరు తాగడం వల్ల పురుషులకు కొన్ని సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బీరును మితంగా తాగడం పర్వాలేదు కానీ మరి ఎక్కువగా తీసుకుంటే మాత్రం హానికరం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి అధ్యయనం ప్రకారం, కొంతమంది స్త్రీపురుషులకు లైంగిక చర్యలో పాల్గొనే ముందు బీరు ఇచ్చారని.. ఆ బీరు తాగిన తర్వాత మహిళలపై ఎటువంటి ప్రభావం లేదని వారు నివేదించారు. బీరు తాగిన తర్వాత పురుషులలో లైంగిక శక్తి పెరుగుతుందని ఒక అధ్యయనంలో తేలింది. కానీ బలహీనమైన పురుషులు బీరు తాగితే మాత్రం వారి సెక్స్ డ్రైవ్ కొంతవరకు తగ్గుతుందని కూడా ఈ నివేదిక పేర్కొంది.
నపుంసకత్వ సమస్య పూర్తిగా తొలగిపోయినా, ఎక్కువగా బీర్ తాగడం వల్ల అంగస్తంభన సమస్య వచ్చే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం చూపిస్తుంది. అందువల్ల, బీరును చాలా పరిమిత పరిమాణంలో తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. యువకులందరూ బీరు తాగే ముందు ఆలోచించి మితంగా తాగాలని.. వీలైతే ఆపడం మరింత మంచిదని చెబుతున్నారు.

