Shiva Rajkumar: “కరుణాడ చక్రవర్తి”, ఫ్యాన్స్ ముద్దుగా శివన్న అని పిలుచుకునే డా.శివరాజ్ కుమార్
సప్త సాగరాలు దాటి సిరీస్ తో ప్రేక్షకులను అలరించిన హేమంత్ ఎం రావు కాంబోలో వస్తున్న సినిమా 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్.. జూలై 12న శివన్న బర్త్ డే సందర్భంగా.. కాస్త ముందుగానే ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.. రెట్రోలుక్ లో కనిపిస్తున్న శివన్నను చూసి ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. ఆయన మేకోవర్ అదిరిపోయింది..
Also Read: Saiyaara: సందీప్ మెచ్చిన బాలీవుడ్ ట్రైలర్
ఇంతకుముందు శివన్న, హేమంత్ కాంబోలో భైరవన కొనే పాట అనే సినిమా అనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ కూడా వదిలారు. 14th Centuryలో జరిగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రావాల్సిన ఆ మూవీ తర్వాత ఆగిపోయింది. ఇప్పుడిది ట్రాక్ ఎక్కించారు. కన్నడలో సూపర్ స్టార్ అయిన శివన్న.. జైలర్ 2 తో పాటు, రామ్ చరణ్ – బుచ్చిబాబుల పెద్ది మూవీలోనూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు.