Prabhas: అర్జున్ రెడ్డి`తో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకున్న సందీప్ రెడ్డి ప్రస్తుతం ప్రభాస్ తో `స్పిరిట్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో విలన్ గా వరుణ్ తేజ్ నటించే అవకాశం ఉందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దానికి కారణం లేకపోలేదు… గతంలో ఒకసారి వరుణ్ తేజ్ మూవీ ఈవెంట్ కు ప్రభాస్ గెస్ట్ గా వెళ్ళాడు. అప్పుడు ప్రభాస్ ను ఉద్దేశించి వరుణ్ తేజ్ `నేను ప్రభాస్ కు `ఛత్రపతి తర్వాతో, బాహుబలి తర్వాతో అభిమానిగా మారలేదు. ఈశ్వర్ సినిమా అప్పుడే మార్నింగ్ షోకు వెళ్ళాను. నాకు ఆయనంటే అంత ఇష్టం“ అని అన్నారు. ఇప్పుడు ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయడం చూస్తుంటే… `స్పిరిట్`తో వరుణ్ తేజ్ కు ఛాన్స్ దక్కిందని, అందుకే వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ను తెలియచేస్తూ ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నారని అంటున్నారు. గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ లేక సతమతమౌతున్న వరుణ్ తేజ్… నిజంగానే `స్పిరిట్`లో విలన్ గా నటిస్తే… అతనికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఖాయం.
