Mahaa Vamsi Comment: ప్రతి గడపకు సంక్షేమ పథకాలు పేరుతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు. ఆయన ఆ వ్యవస్థను ప్రకటించినప్పుడు ప్రజలంతా ఎంతో సంబరపడిపోయారు. ఇంటికే సంక్షేమ పథకాలు అందుతాయని ఆనందపడ్డారు. అంతేకాకుండా ప్రతి ఏభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంటారు. అంటే చాలా మందికి ఉన్న ఊరిలోనే ఉద్యోగాలు వస్తాయి అనే భావనతో వాలంటీర్ వ్యవస్థను స్వాగతించారు. కానీ, వైసీపీ అధినేత మదిలో ఉన్న ఆలోచన.. వలంటీర్ల వ్యవస్థ పేరుతో ఆడిన బిగ్ గేమ్ అర్థం అయిన తరువాత అందరి మైండ్స్ బ్లాంక్ అయిపోయాయి. అవును అప్పట్లోనే ఈ వ్యవస్థ పేరుతొ ఏమి జరుగుతుందనేది జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా వెల్లడించారు.
తనకున్న సమాచారం మేరకు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు చేస్తున్న దాష్టీకాలను వివరించారు. ఆయన వ్యాఖ్యలపై అప్పట్లో చాలా చర్చ జరిగింది. ఎదో గాలివాటుగా ఆయన ఆరోపణలు చేస్తున్నారని పవన్ ప్రత్యర్ధులు విరుచుకుపడ్డారు. కానీ, ఇప్పుడు ఆయన మాటలు నిజమని తేలింది. ఆల్ జజీరా అనే అంతర్జాతీయ మీడియా ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థపై సమగ్రమైన అధ్యయనాన్ని జరిపింది. వాలంటీర్ వ్యవస్థ ప్రారంభం అయినా దగ్గర నుంచి వైసీపీ ప్రభుత్వ కాలంలో ఐదేళ్లు వాలంటీర్ల పనితీరును ఆ అధ్యయనంలో కూలంకషంగా పరిశీలించింది. తమ పరిశోధనలో వెలువడిన అంశాలతో అల్ జజీరా ఒక కథనాన్ని వెలువరించింది. ఇది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగానే కాదు.. అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. అందులో వెలువడిన అంశాలను చూసి మేధావులు కూడా ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ అల్ జజీరా రిపోర్ట్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన పాయింట్లు చూద్దాం.
ఇది కూడా చదవండి: Allu Arjun: తెలంగాణలో నీ సినిమాలు ఆడనివ్వం.. అల్లు అర్జున్ కు ఎమ్మెల్యే మాస్ వార్నింగ్!
Mahaa Vamsi Comment: ముందుగా వలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు కేవలం వైసీపీ సానుభూతి పరులకే దక్కేలా సర్వే నిర్వహించి ఏర్పాటు చేసుకున్నారు. అనర్హులు అంటూ టీడీపీ సానుభూతి పరులు.. ఓటర్లను లిస్టుల నుంచి తప్పించేశారు. ప్రతి ఏభై ఇళ్లకు ఒక వాలంటీర్.. తనకు కేటాయించిన ఇళ్లపై.. ఇంటిలోని వ్యక్తులపై నిఘా చేయడానికి ఉపయోగపడేలా ఏర్పాటు చేశారు.
ఒకసారి సర్వ్ చేసి ఆ ఇళ్లలోని వ్యక్తుల వివరాలు సేకరించడమే కాకుండా.. ప్రతి వారం ఇంటిలో ఏమి జరుగుతోంది అనేదానిపై సమగ్ర రిపోర్ట్ సిద్ధం చేసేవారు. ఇంటిలో సమస్యలు.. భార్యాభర్తల మధ్య గొడవలతో సహా పలు విషయాలు ఈ రిపోర్ట్ లో ఉండేవి. వాలంటీర్లు, స్థానిక వైసీపీ నాయకులు, ఎఫ్ఏవో లతో వాట్సాప్ గ్రూప్ లు నిర్వహించారు. వీటి ద్వారా పూర్తి డేటాను సేకరించి దానిని ఐ పాక్ కు చేరవేసేవారు. వారి సూచనలతో ఆయా ఇళ్లలో ఉన్న ఓటర్లను ప్రభావితం చేసేవారు.
Mahaa Vamsi Comment: మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. ఇలాంటివి చాలా విషయాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా నడిపించినట్టు అల్ జజీరా వెల్లడించింది. ఇప్పుడు ఈ అంశం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓటర్లను పూర్తిగా బ్లాక్ మెయిల్ చేసే విధంగా ప్రభుత్వ ధనంతో వ్యవస్థలను నడిపించారు జగన్మోహన్ రెడ్డి. అందుకే వై నాట్ 175 అంటూ గట్టిగా నినాదాలు చేసేవారని ఇప్పుడు అర్ధం అవుతోంది. అయితే, ఆయన వ్యూహం పవన్ కళ్యాణ్ అప్రమత్తతతో బెడిసికొట్టింది. ప్రజల్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తరువాత ఆలోచన ప్రారంభం అయింది. వలంటీర్ల ద్వారా ఎలా మోసపోతున్నామనే విషయం వారికీ అర్ధం అయింది. దీంతో ఎన్నికల్లో వైసీపీకి గట్టి గుణపాఠం చెప్పారని అనుకోవచ్చు.
ప్రజలు తమ ఓట్ల ద్వారా గుణపాఠం చెప్పారు. అయితే, ఇప్పుడు అల్ జజీరా పరిశోధనతో బయటకు వచ్చిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఆ కథనంలో నిజా నిజాలు నిగ్గు తేల్చాల్సి ఉంది. దీంతో పాటు ఇంత పెద్ద స్కామ్ నడిపించిన వారిపై చర్యలు తీసుకోవాలి.