Priyanka Gandhi: వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. 12 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆమెకు రూ.4.24 కోట్ల చరాస్తులు, రూ.7.74 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. దీంతో పాటు ఆమె తన భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల వివరాలను కూడా తెలియచేశారు. వాద్రా మొత్తం ఆస్తుల విలువ రూ.65.54 కోట్లు, ఇందులో చరాస్తులు రూ.37.9 కోట్లు, స్థిరాస్తులు రూ.27.64 కోట్లు.
ప్రియాంక అఫిడవిట్‌పై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా గురువారం మాట్లాడుతూ – ‘ప్రియాంక గాంధీ వాద్రా అఫిడవిట్లో, భర్త రాబర్ట్ వాద్రా ఆస్తికి సంబంధించిన సమాచారం తప్పుగా ఇచ్చారని చెప్పారు. రాబర్ట్ వాద్రా ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ ఆదాయపు పన్ను శాఖ మాత్రం ఎక్కువ డిమాండ్ చేస్తోంది. ఇది ఎలా జరుగుతుంది? అతను సిమ్లాలో ఒక ఇల్లు కొన్నాడు, కానీ దాని ధరలో పదో వంతు మాత్రమే కోట్ చేశాడు. అంటే చూపించే పళ్లు వేరు, తినే పళ్లు వేరు అంటూ చురకలు అంటించారు.
Priyanka Gandhi: గౌరవ్ భాటియా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేల చిత్రాన్ని చూపించారు. ఖర్గే వెనుక సీటులో కూర్చున్నారు. ఖర్గే వెనుకబడిన తరగతి నుంచి వచ్చారని అన్నారు. ఏదో ఒక పోస్ట్‌పై కూర్చోవడం ద్వారా, ఈ వ్యక్తులు రిమోట్‌ను తమ చేతుల్లో ఉంచుకున్నారు. ఇంతమంది బయటి వ్యక్తిని నాయకుడిగా అంగీకరించడానికి ఇష్టపడరు. మౌలానాల సమావేశంలో కాంగ్రెస్‌ను ముస్లిం పార్టీగా పరిగణించారు. ఇది కాకుండా, వాయనాడ్‌లో విపత్తు సమయంలో ఇంత సంపద ఉన్నప్పటికీ, ఈ కుటుంబం ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వలేదని అన్నారు.
రాహుల్ గాంధీ వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. అందుకే ప్రియాంక గాంధీ తొలిసారి ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమెపై బీజేపీ నవ్య హరిదాస్‌ను రంగంలోకి దించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్, యూపీలోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. రాహుల్ గాంధీ కుటుంబ సంప్రదాయ స్థానమైన రాయ్‌బరేలీని ఎంచుకుని వాయనాడ్‌ను విడిచిపెట్టారు. నవంబర్ 13న ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది. నవంబర్ 23న ఫలితాలు రానున్నాయి.