Dil Raju

Dil Raju: “మార్కో” దర్శకునితో దిల్ రాజు సినిమా!

Dil Raju: సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో నష్టాల్లోంచి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు దిల్ రాజు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి లేటెస్ట్ గా ఓ క్రేజీ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. దిల్ రాజు క్రేజీ కాంబినేషన్ తో వచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఇటీవల మళయాళంలో భారీ హిట్ అయిన ఏ రేటింగ్ చిత్రం మార్కో. ఈ చిత్రం ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే.ఇక ఈ చిత్రం దర్శకుడు హనీఫ్ అదేనితో సాలిడ్ ప్రాజెక్ట్ ని నిర్మాతలు దిల్ రాజు, హర్షిత్ రెడ్డి, దిల్ రాజు కూతురు హన్షితలు కన్ఫర్మ్ చేశారు. పైగా ఈ చిత్రం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఉంటుంది అని తెలుస్తుంది. తెలుగులోనే ఈ సినిమా తెరకెక్కి పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని ఒక క్రేజీ మల్టీస్టారర్ గా కూడా తెరకెక్కిస్తున్నట్టుగా టాక్. ఇక ఈ సినిమాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ త్వరలో రానున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *