Dil Raju

Dil Raju: స్టార్ హీరోల సపోర్ట్‌తో ఆర్థిక ఆటుపోట్ల నుంచి బయటపడ్డ దిల్ రాజు!

Dil Raju: ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తాజాగా తన కెరీర్‌లో ఎదురైన సవాళ్లను, స్టార్ హీరోల సహకారాన్ని గురించి బయటపెట్టిన విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నితిన్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన “తమ్ముడు” సినిమా ట్రైలర్ లాంచ్‌లో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో తనకు స్టార్ హీరోలు అండగా నిలిచారని దిల్ రాజు గుండెలు తెరిచి చెప్పారు. “బృందావనం” సమయంలో ఎన్టీఆర్, “మిస్టర్ పర్ఫెక్ట్” సమయంలో ప్రభాస్, “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సమయంలో మహేష్ బాబు, “వకీల్ సాబ్” సమయంలో పవన్ కళ్యాణ్ తనకు సపోర్ట్ చేశారని వెల్లడించారు. కేవలం సినిమా చేయడమే కాకుండా, తన పరిస్థితిని అర్థం చేసుకుని సలహాలు, సహాయం అందించారని ఆయన గర్వంగా చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. “తమ్ముడు” సినిమాతో మరో హిట్ కొట్టేందుకు దిల్ రాజు సిద్ధమవుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mehaboob Dilse: నువ్వే కావాలి’ అంటున్న బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *