Dil Raju: ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగలేదని ప్రముఖ సినీ నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు చెప్పారు. శనివారం మీడియాతో పలు విషయాలను పంచుకున్నారు. దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాలు, ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు నాలుగు రోజులపాటు తనిఖీలు చేపట్టారు.
Dil Raju: ఐటీ దాడులపై ఆయన స్పందిస్తూ శనివారం మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. ఐదేండ్లుగా తాము ఎక్కడా పెట్టుబడులు పెట్టలేదని స్పష్టం చేశారు. సినిమాలకు సంబంధించిన వివరాలు అడిగారని, వారు అడిగిన వివరాలన్నింటినీ తాము ఇచ్చామని ఆయన చెప్పారు.
Dil Raju: ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగలేదని దిల్ రాజు చెప్పారు. సినీరంగంలోని పలువురు ప్రముఖులపైనా కూడా ఐటీ తనిఖీలు జరిగాయని చెప్పుకొచ్చారు. నిబంధనల ప్రకారమే తన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయని తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగలేదని, తానూ వారికి పూర్తిగా సహకరించినట్టు చెప్పారు. 90 శాతం టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్నారని, ఇక బ్లాక్ మనీ సమస్యే లేదని దిల్‌రాజు తెలిపారు.
Dil Raju: ఫేక్ కలెక్షన్లపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఫేక్ కలెక్షన్లపై సినీ ఇండస్ట్రీ కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పారు. తన వద్ద భారీగా నగదు, పత్రాలు లభ్యమైనట్టు కొన్ని చానళ్లు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద కేవలం రూ.20 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. తన తల్లి ఆసుపత్రిలో ఉన్నారని, దయచేసి తప్పుడు వార్తలు రాయొద్దని మీడియాను కోరారు.