Dhruv Jurel: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ లో తలపడనున్న టీమిండియా తుదిజట్టులో కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ కో చోటు ఖాయమైనట్లేనా? ఈ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరమైతే బ్యాకప్ ఓపెనర్‌గా జురెల్ ను ఎంచుకుంటారా? అన్న ప్రశ్న ఇపుడు అందరి మదిలో మెదులుతోంది.
రోహిత్ తొలి టెస్టు మిస్పవుతాడని కన్ఫామ్ అయిన నేపథ్యంలోనే టీమిండియా మేనేజ్‌మెంట్ కేఎల్ రాహుల్ ను బ్యాకప్ ఓపెనర్‌గా ఉపయోగించాలని భావించింది. అందుకే అతడిని ఎ జట్టు కోసం ఆస్ట్రేలియాకు పంపింది. అయితే రాహుల్ ఆసీస్-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలోనూ దారుణంగా విఫలమయ్యాడు. రాహుల్‌తో పాటు మరో బ్యాకప్ ఓపెనర్‌గా భావించిన అభిమన్యు ఈశ్వరన్ కూడా రెండు అనధికారిక టెస్టుల్లో చేతులెత్తేస్తే, వీరితో పాటు ఓపెనర్ రేసులో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ సైతం విఫలమయ్యాడు. దీంతో ప్రత్యామ్నాయం ఎవరు అనేది ఇపుడో పెద్ద చర్చ.
ఇది కూడా చదవండి: Chappell to Shaw: పృధ్వీ షా…ఆటపైనే దృష్టి పెట్టు.. ఛాపెల్ సూచన
Dhruv Jurel: రెండో అనధికారిక టెస్టులో అద్భుతంగా ఆడిన వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ ధృవ్ జురెల్‌ను ఇపుడు రోహిత్‌కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. యశస్వి జైస్వాల్‌కు జతగా ఇతర ఫార్మాట్లలో ఓపెనింగ్ అనుభవమున్న శుభ్‌మన్ గిల్‌ను పంపి జురెల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలని కొందరు సూచిస్తున్నారు. ఆసీస్‌తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో అందరూ విఫలమైన చోట జురెల్ మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు.
తొలి ఇన్నింగ్సులో 186 బంతులు ఎదుర్కొని 80 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 122 బంతులు ఎదుర్కొని 68 పరుగులు చేశాడు. అందరినీ ఇబ్బంది పెట్టిన బౌలర్ల ను జురెల్ అవలీలగా ఆడి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. రెండు ఇన్నింగ్సుల్లోనూ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న జురెల్, ఆసీస్ కండిషన్స్ కూ అలవాటు పడి ఉంటాడు కనుక… అతడికి తొలి టెస్టులో చోటు కల్పించాలన్న డిమాండ్ ఊపందుకుంది. మరి టీమిండియా మేనేజ్‌మెంట్ ఏం చేస్తుందో వేచి చూడాలి.