Devotional: ఓం నమః శివాయ… శైవ క్షేత్రాలు పోటెత్తిన భక్తులు

Devotional: కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా శైవ క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. శివ భక్తులతో పాటు దేశంలోని హిందువులకు కార్తీక మాసం ఎంతో ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ కార్తీక మాసంలో హిందువులు పరమశివుడిని భక్తి శ్రద్దలతో ఆరాధిస్తుంటారు. ఇందులో ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి.. తమ భక్తిని చాటుకుంటారు.

కార్తీక మాసం ప్రారంభం అయిన తర్వాత వచ్చిన రెండో సోమవారం కావడంతో.. తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజాము నుంచి మహా దేవుని దర్శనం కోసం భక్తులు ప్రధాన దేవాలయాల వద్ద బారులు తీరారు. సూర్యోదయం కాకముందే పుణ్య స్నానాలు ఆచరించి ఆలయం వద్ద ఉన్న నదులు, కాలువలు, మండపాలు, కోనేరులలో కార్తీక దీపాలు వదిలారు. అనంతరం శివునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు.

దీంతో తెలుగు రాష్ట్రాలు సోమవారం తెల్లవారుజాము నుంచి శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. నల్లగొండ జిల్లాలోని చెరువుగట్టు ఏపీలోని నంద్యాల జిల్లా లోని శ్రీశైలం క్షేత్రానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఆ పరమ శివుడు దర్శనం కోసం ఎంతోమంది క్యూలైన్లో వేచి ఉన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Telangana: గ్రూప్ 1 మెయిన్స్‌పై ర‌గులుతున్న నిరుద్యోగులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *