Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీని గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు, “అనికేత్” అనే అరుదైన పిలిచేవారని పవన్ అన్నారు. అనికేత్ అంటే ఇళ్లు లేకుండా అని అర్ధం అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ప్రధాని గురించి పవన్ చేసిన ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజాగా అమరావతిలో జరిగిన రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న పవన్, ప్రధాని మోదీకి తన గత సన్యాస జీవితం నాటి పేరును గుర్తు చేశారు. మోదీకి “అనికేత్” అనే పేరు ఉండేది అని పేర్కొన్నారు. ఈ పేరుకు అర్థం – “ఇల్లు లేనివాడు”. ఇది మామూలు పదమే కాకుండా, పరమశివుడిని వర్ణించేందుకు కూడా ఉపయోగించే పదం అని పవన్ వివరించారు.
పవన్ తన ట్విట్టర్ ఖాతాలో, “అనికేత్ – ఇది ఒక పేరు కాదు, ఒక సంకల్పం” అంటూ Prime Minister Modi గురించి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయన వ్యాఖ్యల ప్రకారం, మోదీ తన వ్యక్తిగత జీవనంలో ఇల్లు లేకున్నా, దేశవ్యాప్తంగా కోట్ల మందికి ‘ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన’ ద్వారా ఇళ్లు అందించిన వ్యక్తిగా నిలిచారని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్వయంగా స్పందించినట్లు కనిపించింది. సభ వేదికపై పవన్ “అనికేత్” అని పిలిచిన తర్వాత మోదీ ఒక్క క్షణం ఆశ్చర్యపోయినట్టు కనిపించినా, వెంటనే చిరునవ్వుతో ప్రతిస్పందించారు.
Also Read: Dhanashree Verma: చాహల్‌కు షాక్ ఇచ్చిన ధనశ్రీ వర్మ..విడాకుల తర్వాత ఐటమ్ సాంగ్
Deputy CM Pawan: ఈ ట్వీట్ పునర్నిర్మాణ కార్యక్రమం కంటే కూడా ఎక్కువ దృష్టిని ఆకర్షించింది. మోదీకి ఇది మరొక గుర్తింపు అని, ఆయన జీవిత పయనానికి అర్థవంతమైన గుర్తింపు అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే, రాజకీయాలతో పాటు సినిమాలలోనూ క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన నటిస్తున్న “హరి హర వీరమల్లు” సినిమా షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
మొత్తానికి, “అనికేత్” అనే పదం మోదీ వ్యక్తిత్వానికి కొత్త దిశ చూపించగా, పవన్ కళ్యాణ్ ట్వీట్ మరోసారి ఆయన ప్రత్యేక అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది.
“अनिकेत” – एक नाम, एक संकल्प।
मठवासी जीवन के दौरान माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को ‘अनिकेत’ कहा गया, जिसका अर्थ होता है- ‘बिना घर का’।
‘अनिकेत’ भगवान शिव का भी एक नाम है, जो सृष्टि के शाश्वत संन्यासी हैं; ब्रह्मांड का कण-कण जिनका घर है, और फिर भी उनका अपना कोई घर… pic.twitter.com/mrMhTHkFJ5
— Pawan Kalyan (@PawanKalyan) May 8, 2025