Pawan Kalyan: నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి దారితీశాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.
ఇంటి మీద దాడి.. తీవ్ర ఆరోపణలు
ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత, ఆయన ఇంటిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్, వస్తువులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, తమకు దాడులతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాము దాడుల రాజకీయాన్ని సమర్థించమని అన్నారు. అయితే, ఇది టీడీపీ వర్గాలు చేసిన పనని ఆరోపించారు ప్రసన్న కుమార్ రెడ్డి.
పవన్ కళ్యాణ్ కఠినంగా స్పందన
ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘‘ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా అసభ్యకరంగా ఉన్నాయి. మహిళలను అవమానించడమే వైసీపీ నేతలకు అలవాటైపోయింది. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం బాధాకరం. ఇలా వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం సరికాదు. ప్రజాస్వామిక వ్యవస్థలో ఇలాంటి మాటలు మాని, బాధ్యతగా మాట్లాడాలి. మహిళల గౌరవాన్ని కాపాడడంలో అందరూ ముందుకు రావాలి’’ అని చెప్పారు.
చట్టపరమైన హెచ్చరిక
పవన్ కళ్యాణ్ హితవు చెబుతూ, ‘‘మహిళలపై అసభ్యంగా మాట్లాడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు. గతంలోనూ శాసనసభలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్లపై ప్రజలు తగిన తీర్పు ఇచ్చారు. ఇకనైనా ఈ మాటల రాజకీయాన్ని ఆపాలి. మహిళా సమాజం మరోసారి తగిన బుద్ధి చెబుతుంది’’ అంటూ హెచ్చరించారు.
మహిళలను కించపరచే నోటి వదరు ఆ పార్టీని వదల్లేదు
•కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారిపై మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి
మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయింది. కోవూరు శాసనసభ్యురాలు…
— JanaSena Party (@JanaSenaParty) July 8, 2025
ఇది కూడా చదవండి:
Yamuna Sand Mining: యమునాలో ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టండి.. సీఎం యోగికి ఢిల్లీ సీఎం లేఖ
KTR: అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధమే.. కానీ మైక్ కట్ చేయకుండా ఉంటారా