Pawan Kalyan: మహా న్యూస్ కథనాలకు బీఆర్ఎస్ పార్టీ భయపడింది. వాస్తవాలు జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ నేతలను ఉసుగొలిపి మహా న్యూస్ ఆఫీస్ పై చేయించారు. ఆఫీస్ లోని ఫర్నీచర్.. ఆఫీస్ ముందున్న కార్లను ధ్వంసం చేశారు బీఆర్ఎస్ రౌడీలు.. ఈ ఎటాక్ ను జనసేన పార్టీ తివ్రంగా ఖండించింది. ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ…’ హైదరాబాద్ లోని మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై చోటు చేసుకున్న దాడి గర్హనీయం. మీడియాలో ప్రసారమయ్యే, ప్రచురితమయ్యే వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియచేసే విధానం ఒకటి ఉంటుంది. ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడటం సమంజసం కాదు. మహా న్యూస్ ఛానెల్ పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలి. ఈ దాడికి కారకులైనవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను’. అని పేర్కొన్నారు.
మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై దాడి గర్హనీయం
హైదరాబాద్ లోని మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై చోటు చేసుకున్న దాడి గర్హనీయం. మీడియాలో ప్రసారమయ్యే, ప్రచురితమయ్యే వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియచేసే విధానం ఒకటి ఉంటుంది. ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడటం సమంజసం కాదు.…
— JanaSena Party (@JanaSenaParty) June 28, 2025

