Delivery Boy Attacked: కొందరు మనుషులు విచక్షణ కోల్పోతున్నారు. వయసు, లింగభేదం లేకుండా ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఎదుటివారు ఎలాంటి వారైనా, ఎంతటి వారైనా దాడులకు తెగబడుతున్నారు. అయినవారు, కానివారైనా అదే తీరు ప్రదర్శిస్తున్నారు. మెట్రోపాలిటన్ నగరాల్లో ఇలాంటి విపరీతాలు మితిమీరుతున్నాయి. తాజాగా ఫుడ్ డెలివరీ కాస్త ఆలస్యమైందని ఓ డెలివరీ బాయ్‌పై దారుణంగా దాడికి తెగబడ్డారు.
Delivery Boy Attacked: బెంగళూరులోని శోభా థియేటర్ సమీపంలో జొమాటాలో కొందరు ఫుడ్ ఆర్డర్ పెట్టారు. డెలివరీ బాయ్ కాస్త ఆలస్యంగా వచ్చాడు. ఫుడ్ తయారీలో ఆలస్యమైందా? ట్రాఫిక్‌లో జాప్యమైందా? మరే కారణమో కనీసం కనుక్కోకుండా, బైక్‌పై నుంచి ఆబాయ్ దిగకుండా, నడిరోడ్డుపైనే ఉన్న అతనిపై విచక్షణారహితంగా కొట్టారు.
Delivery Boy Attacked: రాత్రి సమయం కావడంతోపాటు వర్షంలో ట్రాఫిక్ సమస్యతో ఆలస్యమైందని ఆ డెలివరీ బాయ్ వేడుకున్నా, వినిపించుకోకుండా అతనిపై పిడుగుద్దుల వర్షం కురిపించారు. దొరికిన వస్తువులు దొరికినట్టు అతనిపై బాదుతూ దౌర్జన్యం ప్రదర్శించారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు విడిచిపెట్టారు.