Delimitation:

Delimitation: 2026 త‌ర్వాత పెరిగే లోక్‌స‌భ సీట్లు ఇవే.. రాష్ట్రాల వారీగా వివ‌రాలు!

Delimitation:దేశ‌వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న‌ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్ విభ‌జ‌న 2026లో జ‌ర‌గాల్సి ఉన్న‌ది. ఈ భారీ ప్ర‌క్రియ త‌ర్వాత అన్ని రాష్ట్రాల్లో లోక్‌స‌భ‌, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ నేప‌థ్యంలో ద‌క్షిణాది రాష్ట్రాలు భ‌య‌ప‌డుతున్నాయి. ఉత్త‌రాది రాష్ట్రాల కంటే ద‌క్షిణాది రాష్ట్రాల్లో త‌క్కువ సీట్లు పెరుగుతాయ‌ని రాజ‌కీయ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో ఉత్త‌రాది ఆధిప‌త్యం మ‌రింత పాదుకుంటుంద‌ని వారు ఆరోపిస్తున్నారు.

Delimitation:జ‌నాభా ప‌రంగా ఈ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్ విభ‌జ‌న జ‌రుగుతున్నందున ఉత్త‌రాది రాష్ట్రాలు ఎక్కువ‌గా ల‌బ్ధిపొంద‌డం ఖాయంగా క‌నిపిస్తున్న‌ది. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు భారీ న‌ష్టం త‌ప్ప‌ద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. దీంతో ఇప్ప‌టికే ఆ భ‌యాల‌తో త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌, తెలంగాణలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌దిత‌రులు అభ్యంతరాల‌ను వ్య‌క్తం చేశారు. జ‌నాభా ప‌రంగా కాకుండా, ఆయా రాష్ట్రాల నుంచి కేంద్రానికి వ‌చ్చే ఆదాయం ప్రాతిప‌దిక‌గా విభ‌జ‌న జ‌ర‌గాల‌ని వారు కోరుతున్నారు. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం ఇంకా స్పందించ‌లేదు.

Delimitation:దేశ‌వ్యాప్తంగా పెరిగే లోక్‌స‌భ సీట్ల‌తో క‌ల‌పి చూస్తే ఆ సంఖ్య 543 నుంచి 848కి పెరుగుతుంది. ఇందులో యూపీ, బీహార్ రాష్ట్రాల వాటాయే 222గా చేరుతుంది. ద‌క్షిణాది రాష్ట్రాల‌న్ని క‌లిపినా 165 మాత్ర‌మే అవుతుంది. ద‌క్షిణాది మిన‌హా ఇత‌ర రాష్ట్రాల‌న్నీ క‌లిపితే 461 సీట్లు అవుతుంది. దీంతోనే ద‌క్షిణాది రాష్ట్రాల రాజ‌కీయ నేత‌లు, విశ్లేష‌కులు అభ్యంత‌రాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ద‌క్షిణాదికి అన్యాయం చేయొద్ద‌ని కోరుతున్నాయి.

విభ‌జ‌న అనంత‌రం రాష్ట్రాల వారీగా లోక్‌స‌భ సీట్లు
జ‌మ్ము క‌శ్మీర్ – 9
హిమాచ‌ల్ ప్ర‌దేశ్ -4
పంజాబ్ – 18
ఉత్త‌రాఖండ్ – 7
హ‌ర్యానా -18
ఢిల్లీ – 13
యూపీ – 143
రాజ‌స్థాన్ – 50
గుజ‌రాత్ – 43
మ‌ధ్య‌ప్ర‌దేశ్ – 52
జార్ఖండ్ – 24
బీహార్ – 79
ఛ‌త్తీస్‌గ‌ఢ్ – 19
ప‌శ్చిమ‌బెంగాల్ – 60
సిక్కిం – 1
అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ – 2
నాగాలాండ్ – 1
మ‌ణిపూర్ – 2
మిజోరం – 1
త్రిపుర – 2
మేఘాల‌య – 2
ఒడిశా – 28
మ‌హారాష్ట్ర – 70
ఏపీ, తెలంగాణ – 54
క‌ర్ణాట‌క – 41
త‌మిళ‌నాడు – 49
పుదుచ్చేరి -1
కేర‌ళ – 20
ల‌క్ష్యదీప్ – 1
గోవా – 2
అండ‌మాన్ – 1
దాద్రాన‌గ‌ర్ హ‌వేలీ – 2

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *