Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి అంఖానికి చేరుకున్నది. ఈ దశలో వైరి పార్టీల తరఫున తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే తొలి దశ ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని వచ్చారు. మలి విడత ప్రచారానికి ఆయన సిద్ధమయ్యారు. తొలిసారిగా ఎన్డీయే పక్ష నేతగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాజాగా వెళ్లనున్నారు.
Delhi: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి వైరి పక్షాల తరఫున ప్రచారం చేయనున్నారు. ఎన్డీయే పక్షాన ఆ కూటమి అభ్యర్థుల తరఫున చంద్రబాబు, కాంగ్రెస్ అభ్యర్థుల కోసం రేవంత్‌రెడ్డి ప్రచారం చేయనున్నారు. దీంతో అక్కడి తెలుగు ప్రజలతో పాటు ఇతర వర్గాల్లోనూ వీరి ప్రభావం పడనున్నది.
Delhi: ఇప్పటికేతొలి విడత ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి రాజధాని వాసులకు హామీల వర్షం కురిపించారు. కాంగ్రెస్ హామీల అమలుపై నాదే పూచీకత్తు అంటూ అక్కడి ఓటర్లకు భరోసా కల్పించారు. ఈ రోజే అంటే ఫిబ్రవరి 2న రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ రోజు, రేపు కూడా కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ముమ్మర ప్రచారం చేయనున్నారు.
Delhi: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆదివారమే ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి సాయంత్రం 5.20 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రికి పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలను కలిసి బడ్జెట్ కేటాయింపులపై ధన్యవాదాలు తెలుపుతారు. సోమవారం ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు పాల్గొంటారు.

