Delhi: కాలుష్యం ధాటికి ఢిల్లీ అతలాకుతలమవుతుంది. వారం రోజులుగా అక్కడి గాలి నాణ్యత 400 పాయింట్లు పైగా నమోదవుతూ వస్తుంది. ఇవాళ ఏకంగా హిస్టరీ రికార్డు చేస్తూ 500 పాయింట్లకి తాకింది.ఢిల్లీ – ఎన్సీఆర్‌లో గాలి నాణ్యత సూచి 500 మార్క్‌కు చేరింది. మంగళవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 494గా నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు కళ్ల మంటలు, దురద, గొంతు నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రాజధానిలో విషపూరిత పొగమంచు కారణంగా దృశ్యమానత పడిపోయింది. ముందు వెళ్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రాజధానికి రాకపోకలు సాగించే కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు.
ఢిల్లీలో ఉన్న ఈ ప్రాంతాలన్నీ హై డేంజర్ కేటగిరీలో ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 22 స్టేషన్లలో గాలినాణ్యత పూర్తిగా క్షీణించింది. ఉదయం 7 గంటల సమయానికి ఢిల్లీలో ఏక్యూఐ 428గా నమోదైంది. బుధవారం నుంచి ఇప్పటి వరకూ ఢిల్లీలో డేంజర్, హై డేంజర్ పరిస్థితులే కనిపిస్తున్నాయి. అక్కడి వాతావరణశాఖ చెప్పిన వివరాల ప్రకారం.. బవానాలో అత్యధికంగా 471 ఏక్యూఐ నమోదైంది. అశోక్ విహార్, జహంగీర్ పురి లలో 466, ముండ్కా, వాజిర్పూర్ లలో 463, ఆనంద్ విహార్, షాదిపూర్, వివేక్ విహార్ లలో 457, రోహిణి, పంజాబి బాగ్ లలో 449, 447 ఏక్యూఐ నమోదైంది.