Delhi: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో డీఏ పెంపుకు ఆమోదం తెలిపింది. డీఏలో 3 శాతం పెంపు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు జూలై 1 నుంచి అమలులోకి రానుంది. దీని వలన సుమారు 49.2 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.
అదే విధంగా, విద్యా రంగానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 57 నూతన కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యా అవకాశాల విస్తరణకు ఈ నిర్ణయం దోహదపడనుంది.
వ్యవసాయ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మరో ప్రధాన నిర్ణయం తీసుకుంది. పప్పు దినుసుల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ‘ఆత్మనిర్భర్ భారత్’ పథకం కింద రూ.11,440 కోట్లు కేటాయించనున్నట్టు కేబినెట్ ప్రకటించింది.
ఈ మూడు కీలక నిర్ణయాలతో ఉద్యోగులు, విద్యారంగం, రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించినట్టైంది.