Delhi: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని హైకోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. నగరంలోని తరచూ స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ చేస్తూ ఆకతాయిలు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించేవారు. అలాంటిది ఏకంగా హైకోర్టుకే దుండగుల నుంచి బెదరింపు మెయిల్ రావడంతో అంతా అప్రమత్తమయ్యారు. దీంతో పరిసరాలను పోలీసులు ఖాళీ చేయించారు.
Delhi: బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఢిల్లీ హైకోర్టు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొన్నది. హైకోర్టులో బాంబులు పెట్టినట్టు అక్కడి సెక్యూరిటీ సిబ్బందికి మెయిల్ వచ్చింది. హైకోర్టు ఆవరణలోనే మూడు ఆర్డీఎక్స్ బాంబులను అమర్చినట్టు ఆగంతులకు ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. కాసేపట్లో అవి పేలుతాయని హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Delhi: బాంబ్ పెట్టిన నిందితులకు పాక్, ఐసిస్‌తో సంబంధాలున్నట్టు ప్రస్తావించడం గమనార్హం. దీంతో మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా సిబ్బంది అప్రమత్తమై కోర్టు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపి వేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతోపాటు స్థానిక పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. సమీప ప్రాంతాల ప్రజలు కూడా బాంబు బెదిరింపులతో భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు.

