Delhi: ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేసులో విచారణ మలుపు తిరిగింది. దర్యాప్తు సంస్థలు తాజాగా గుర్తించిన సమాచారం ప్రకారం, ఈ దాడి యాదృచ్ఛికం కాదు. డిసెంబర్ 6న బాబ్రీ మసీదు విధ్వంస దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్రణాళిక సిద్ధమైందని తెలిసింది. ఈ కుట్ర వెనుక డా. ఉమర్ అనే మౌలానా మేథావి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు.
ఉగ్రవాదుల అరెస్ట్‌తో ఎర్రకోట దాడి ప్రణాళిక ముందుగానే బయటపడింది. డాక్టర్ ఉమర్ తన అనుచరులతో కలిసి తబ్లిగి జమాత్ మసీదులో సమావేశమై ఉగ్రదాడి యోచనను రూపొందించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అక్కడే ప్రత్యేక ప్రార్థనల అనంతరం దాడికి సంకేతాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది.
సీసీటీవీ ఫుటేజ్లలో ఉమర్ మసీదులోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు కేసులో కీలక సాక్ష్యాలుగా మారాయి. ఇప్పటికే దాడికి సంబంధించి అరెస్టయిన నలుగురు విచారణలో కీలకమైన విషయాలు వెల్లడిస్తున్నారని సమాచారం.
ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నట్లు, డిసెంబర్ 6న దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకేసారి పేలుళ్లు జరగాలని ఉగ్రవాదుల ఉద్దేశం. అయితే ముందస్తు సమాచారం ఆధారంగా పలు రాష్ట్రాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని వెల్లడించారు.

