Delhi: ఏపీకి ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ గౌరవం – రాష్ట్రంలోని ఐదు నగరాలకు కేంద్ర గుర్తింపు

Delhi: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కి పెద్ద గౌరవం దక్కింది. రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి నగరాలు ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం, స్థిర పరిష్కారాలు వంటి అంశాల్లో ఉత్తమ ప్రదర్శన వల్ల ఈ గుర్తింపు లభించిందని అధికారులు తెలిపారు.

ఎంపికైన నగరాలు & అవార్డులు:

విశాఖపట్నం: ప్రత్యేకంగా ‘స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డు దక్కింది.

విజయవాడ, గుంటూరు, తిరుపతి: ‘స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్’ కేటగిరీలో ఎంపికయ్యాయి.

రాజమండ్రి: రాష్ట్రస్థాయి మినిస్టీరియల్ అవార్డు పొందింది.

ఈ అవార్డుల ఎంపికలో స్వచ్ఛ భారత్ మిషన్ భాగంగా పట్టణాల్లోని శుభ్రత, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, పౌరుల సహకారం వంటి అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విజేత నగరాల పౌరులకు, స్థానిక సంస్థలకి అభినందనలు తెలిపింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రాష్ట్రంలో శుభ్రతపై మరింత అవగాహన పెంచేందుకు దోహదపడతాయని అధికారులు అభిప్రాయపడ్డారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  AP news: జగన్ హయాంలో మద్యం వల్ల లివర్లు చెడిపోయాయి నిపుణుల కమిటీ నివేదిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *