Delhi Air Pollution: ఢిల్లీలో వాయుకాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ అభయ్ ఎస్ ఓక్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనంలో ఈ కేసు విచారణ జరగనుంది.
సీనియర్ న్యాయవాది అపరాజితా సింగ్ అప్పీల్‌పై ఈ కేసు లిస్టింగ్ అయింది. ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తక్షణమే విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.
నవంబర్ 14 న, అమికస్ క్యూరీ మాట్లాడుతూ – ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యం నియంత్రణ కోసం ఎటువంటి ప్రయంతలు చేయలేదని ఆరోపించారు. అంతేకాకుండా పరిస్థితి తీవ్రంగా ఉందని ఆమె కోర్టుకు తెలిపారు. ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మారకూడదన్నారు. అనంతరం కోర్టు విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Ashwini Vaishnaw: ఫేక్ న్యూస్ ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
Delhi Air Pollution: ఈ విషయం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కాలుష్య నిర్వహణకు సంబంధించినది. ఇది వాహనాల కాలుష్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఎన్‌సిఆర్ రాష్ట్రాల్లో వ్యవసాయ చెత్తను కాల్చడం వంటి సమస్యలను కవర్ చేస్తుంది.
ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ అంటే CAQM.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే GRAP నాల్గవ దశను అమలు చేసింది. దీని నిబంధనలు ఉదయం 8 గంటల నుంచి అమలులోకి రానున్నాయి.