Delhi : బాద్‌షా షారుక్ ఖాన్‌కు భారీ గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2023 సంవత్సరానికి గానూ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఆయనకు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. ‘జవాన్’ చిత్రంలో ఆయన నటనకు ఈ గుర్తింపు లభించిందని జ్యూరీ ప్రకటించింది.
అలాగే, విక్రాంత్ మస్సే కూడా ‘12th ఫెయిల్’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఇద్దరికీ ఈ అవార్డులు సంయుక్తంగా ఇవ్వబోతున్నారు.
ఇక ఉత్తమ నటి అవార్డు ప్రముఖ నటి రాణీ ముఖర్జీకి దక్కింది. ఆమె నటించిన ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ సినిమాలో ఆమె భావోద్వేగపూరిత పాత్రకు ఈ గౌరవం దక్కింది.
ఉత్తమ హిందీ చిత్రంగా ‘కథల్’ (Kathal) ఎంపికైంది.
2023 సంవత్సరానికి సంబంధించిన జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. మొత్తం 15 విభాగాల్లో భిన్న భాషల సినిమాలను పరిశీలించి అవార్డులు ప్రకటించినట్లు జ్యూరీ సభ్యులు తెలిపారు.