Deepika Padukone

Deepika Padukone: అరుదైన ఘనత సాధించిన దీపికా పదుకొణె!

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె అరుదైన ఘనత సాధించారు. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026 కోసం ఆమె ఎంపికయ్యారు. హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మోషన్ పిక్చర్స్ విభాగంలో ఈ గౌరవం పొందిన తొలి భారతీయ నటిగా దీపికా చరిత్ర సృష్టించారు. డెమి మూర్, ఎమిలీ బ్లంట్, రాచెల్ మెక్ఆడమ్స్, స్టాన్లీ టక్కీ లాంటి హాలీవుడ్ ప్రముఖులతో ఈ జాబితాలో ఆమె పేరు చోటు చేసుకుంది.

Also Read: Keerthy Suresh: కీర్తి సురేష్ జోరు.. పెళ్లి తర్వాత ఆఫర్లే ఆఫర్లు!

35 మంది ప్రతిభావంతుల్లో దీపికా ఒకరిగా నిలిచారు. వినోద రంగంలో ఆమె చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది. నటనతో పాటు ఆమె స్పీచులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన ప్రతిభతో అభిమానులను సంపాదించిన దీపికా ఈ అరుదైన గౌరవంతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై చాటారు. ఈ సందర్భంగా ఆమె అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Naari: మార్చి 7న జనం ముందుకు 'నారి'

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *