kcr: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం కేసీఆర్‌కు వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక వైద్య బృందం వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది.
కేసీఆర్ అనారోగ్యం విషయం వెలుగులోకి రాగానే బీఆర్‌ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన ఏర్పడింది. ఆయనను పరామర్శించేందుకు పలువురు పార్టీ నేతలు ఆసుపత్రికి రావొచ్చని సమాచారం. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై త్వరలో వైద్యుల హెల్త్ బులెటిన్ విడుదల కానుంది.