Deepavali: మన దేశంలో అత్యంత ఇష్టంగా జరుపుకునే పండగలో దీపావళి ఒకటి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరం ఆనందంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తాం.. ఇంత చేసినా మనం దీపావళి రోజు అసలు కొనాల్సిన వస్తువులు ఏంటి అనేది మాత్రం మనలో చాలా మందికి తెలియదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నల్ల పసుపు
దీపావళి రోజున నల్ల పసుపునకు కూడా ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. పూజ సమయంలో లక్ష్మీదేవి ముందు నల్ల పసుపు ఉంచి, పూజ అనంతరం దానిని సురక్షితమైన స్థలంలో లేదా డబ్బు వద్ద ఉంచితే ఇంట్లో ఆర్థిక సంతోషం ఉంటుంది.
భీమసేని కర్పూరం
భీమసేని కర్పూరం సాధారణ కర్పూరం కన్నా గాఢమైన వాసన కలిగి ఉంటుంది. దీపావళి రోజు దీన్ని వెలిగించడం ద్వారా ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుందని నమ్మకం. ఈ కర్పూరాన్ని పూజలో ఉపయోగించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని, సంపద, శ్రేయస్సు ఇంట్లో నిలుస్తాయని భావిస్తారు.
ఉప్పు
దీపావళి రోజున ఎనిమిది కిలోల ఉప్పు కొనడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఉప్పు ప్రతికూల శక్తిని గ్రహించే శక్తి కలిగి ఉండటంతో దీపావళి రోజున కొన్న ఉప్పును ఇంటి ముఖ్య ద్వారం వద్ద ఉంచడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణం కొనసాగుతుందని విశ్వసిస్తారు. ఈ దీపావళి పండుగకు ఈ మూడు వస్తువులను కొనుగోలు చేసి, వాటిని సరిగ్గా వినియోగించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద, శ్రేయస్సు సంపాదించవచ్చునట.

