Sheikh Hasina: మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణల కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ప్రత్యేక ట్రిబ్యునల్ మరణ శిక్ష విధిస్తూ సోమవారంసంచలన తీర్పు వెలువరించడంతో దేశంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. హసీనాకు వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పును నిరసిస్తూ ఆమె మద్దతుదారులు, పాలక తాత్కాలిక ప్రభుత్వం మద్దతుదారుల మధ్య రాజధాని ఢాకాతో సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. ఈ హింసాత్మక ఆందోళనలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు, నిరసనకారులపై బాష్పవాయుగోళాలుప్రయోగించారు, లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో అనేక చోట్ల పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం.
Also Read: Road Accident: ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
ఈ అల్లర్లు, పోలీసుల చర్యలలో ఇప్పటికే 50 మందికి పైగా మరణించారు.. వందల మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఢాకాలోని షేక్ హసీనా తండ్రికి చెందిన చారిత్రక భవనం (ధన్మండి 32) వద్ద ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా బస్సులకు నిప్పు పెట్టిన లేదా బాంబులు విసిరిన వారిని కాల్చివేయాలని పోలీసులకు స్పష్టం చేశారు. ప్రస్తుతం షేక్ హసీనా గతేడాది ఆగస్టులో తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయి, భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఆమె లేని సమయంలోనే ఈ విచారణ, తీర్పు ప్రక్రియ జరిగింది. హసీనాపై ఇచ్చిన తీర్పును తాత్కాలిక ప్రభుత్వం స్వాగతించగా, హసీనా వర్గం దీనిని రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఖండిస్తోంది. దేశంలో మరింత ఉద్రిక్తత నెలకొనకుండా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

