Dead Body In Fridge: మధ్యప్రదేశ్ దేవాస్‌లోని ఫ్రిజ్‌లో మహిళ మృతదేహం లభ్యమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. 10 నెలల క్రితం మహిళ హత్యకు గురైంది. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు భావిస్తున్నారు. అయితే, ఆ మహిళను చంపిన తరువాత నిందితుడు మృతదేహాన్ని ఫ్రిజ్‌లో ఉంచి పారిపోయారు. పోలీసులు అతడిని ఉజ్జయినిలో అరెస్ట్ చేశారు.
దేవాస్ నగరంలోని బృందావన్ ధామ్ కాలనీలో ఈ ఘటన జరిగింది. అక్కడ శుక్రవారం మధ్యాహ్నం ఓ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గదిని తెరిచి ఫ్రిజ్‌లో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆ ఇంటిలో గతంలో అద్దెకు ఉన్న సంజయ్ పటిదార్ అనే వ్యక్తి ప్రతిభ అనే మహిళతో సహజీవనం చేసేవాడు. పది నెలల క్రితం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అయితే, కొన్ని సామాన్లను ఒక గదిలో ఉంచి తాళం వేసి పెట్టాడు. అతని తరువాత బల్వీర్ అనే వ్యక్తి ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. తాళం వేసి ఉన్న గది నుంచి దుర్వాసన వెలువడుతుండడంతో శుభ్రం చేయాలని చూడగా ఫ్రిడ్జ్ లో ప్రతిభ మృతదేహం కనిపించింది. విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వారు దర్యాప్తు చేసి ఉజ్జయినిలో ఉన్న నిందితుడు సంజయ్ ను అరెస్ట్ చేశారు. నిందితుడు నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.
ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. 2023 జూలైలో సంజయ్ పటీదార్‌కు ఇంటి యజమాని ధీరేంద్ర శ్రీవాస్తవ ఈ ఇంటిని అద్దెకు ఇచ్చారని BNP పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అమిత్ సోలంకి తెలిపారు. సంజయ్ జూన్ 2024లో ఇంటిని ఖాళీ చేసాడు. కానీ ఫ్రిజ్‌తో సహా అతని వస్తువులలో కొన్నింటిని ఒక గదిలో ఉంచాడు. అక్కడ మహిళ మృతదేహం లభ్యమైంది. వాస్తవానికి ఇండోర్‌లో నివసించే ధీరేంద్ర శ్రీవాస్తవ దేవాస్ లోని తన ఇంటిని అద్దెకు ఇచ్చాడు. అందులో బల్వీర్ రాజ్‌పుత్ చాలా కాలంగా అద్దెకు ఉంటున్నాడు.
ఇది కూడా చదవండి: P Ravichandran: ప్రముఖ గాయకుడు పి. జయచంద్రన్ కన్నుమూత
Dead Body In Fridge: అయితే, బల్వీర్ కంటే ముందు సంజయ్ పాటిదార్ అనే వ్యక్తి ఒక మహిళతో ఆ ఇంట్లో ఉండేవాడు. పది నెలల క్రితం ఒకరోజు తాను ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పి.. తన సామానులు ఒక గదిలో ఉంచి తరువాత తీసుకువెళతానని ఇంటి యజమానికి చెప్పి వెళ్ళిపోయాడు. దీంతో ఆ గదిని అలానే వదిలి శ్రీవాస్తవ మిగిలిన గదులను బల్వీర్ కు అద్దెకు ఇచ్చాడు. ఆ గదిలోంచి దుర్వాసన వస్తుండడంతో శుక్రవారం ఆ గదిని శుభ్రం చేయడానికి బల్వీర్ ప్రయత్నించడంతో ఫ్రిడ్జ్ లో మృతదేహం ఉన్నట్టు గుర్తించాడు. విషయాన్నీ పోలీసులకు తెలిపాడు.
బల్వీర్ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరుగుపొరుగు వారిని విచారించగా పింకీ అలియాస్ ప్రతిభా ఆ ఇంట్లో సంజయ్‌తో కలిసి ఉండేదని చెప్పారు. అంతేకాకుండా, 2024 మార్చి నుండి ప్రతిభాను ఎవరూ చూడలేదని వారు వెల్లడించారు. తరువాత వేగంగా దర్యాప్తు చేసిన పోలీసులు సంజయ్ పాటి దార్ ను ఉజ్జయినిలో అరెస్ట్ చేశారు. నిందితుడు ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
ఉజ్జయిని లో అరెస్టు అయినా సంజయ్ పాటిదార్, అతను ప్రతిభతో ఐదేళ్లుగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవిస్తున్నాడని చెప్పాడు. మూడేళ్లపాటు ప్రతిభను ఉజ్జయినిలో ఉంచి రెండేళ్ల క్రితం దేవాస్‌కు తీసుకొచ్చాడు. ఇక్కడ అద్దెకు ఉంచారు. 2024 జనవరిలో ప్రతిభ పెళ్లి కోసం తనపై ఒత్తిడి చేయడం ప్రారంభించిందని సంజయ్ చెప్పాడు. అతను ఆమెతో విసిగిపోయాడు. దీంతో
ఆమెను గొంతు నులిమి హత్య చేచేశాడు. నిందితుడు తన స్నేహితుడు ఇంగోరియా నివాసి వినోద్ దవేతో కలిసి ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడని చెప్పాడు. మార్చి నెలలో ప్రతిభను ఓ అద్దె ఇంట్లో గొంతుకోసి హత్య చేసి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో ఉంచారు. ఫ్రిజ్‌ని గుడ్డతో కప్పాడు. తరువాత ఇల్లు ఖాళీ చేసి ఉజ్జయిని వెళ్ళిపోయాడు.