Priyanka Chopra: గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా… నిర్మాతగానూ తన మార్క్ ను చూపించడానికి కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకున్న ‘అనూజ’ లఘు చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాధ్యతలను తీసుకుంది. ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించిన ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ ను గునీత్ మోంగా నిర్మించారు. ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే తొమిదేళ్ళ అనూజ అనే అమ్మాయి… భవిష్యత్తు కోసం అన్వేషించే మార్గంలో ఎలాంటి సమస్యలను ఎదర్కొందనే అంశంతో ఈ షార్ట్ ఫిల్మ్ రూపుదిద్దుకుంది. ఇదిలా ఉంటే… లాస్ ఏంజెలెస్ లో ఏర్పడిన కార్చిచ్చు కారణంగా అకాడెమీ అవార్డుల నామినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దాంతో నామినేట్ అయిన చిత్రాల జాబితాను ఈ నెల 19న ప్రకటించబోతున్నట్టు అకాడెమీ తెలిపింది. అలానే ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న మహేశ్ బాబు మూవీ లో ప్రియాంక చోప్రా నటిస్తుందనే వార్తలైతే వచ్చాయి కానీ ఇంతవరకూ ఆమె మాత్రం దీనిపై పెదవి విప్పలేదు.