David Warner: ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ పట్ల తెలుగు ప్రజలకున్న ప్రేమ, ఆసక్తి చాలా ఎక్కువ. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును టైటిల్ కు చేర్చి తెలుగు ప్రజలకు ఎంతో దగ్గరైన డేవిడ్ వార్నర్ ఆటతోపాటు టాలీవుడ్ హీరోలైన బాహుబలి, పుష్ప, డీజే టిల్లు వంటి వారి స్టైళ్లను అనుకరిస్తూ సోషల్ మీడియాలో చేసిన రీల్స్ ద్వారా అభిమానులను ఇప్పటికే ఆకర్షించాడు. ఇప్పుడు ఈ స్టార్ క్రికెటర్ తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టనున్న విషయం ఇప్పుడు టాకింగ్ పాయింట్ గా మారింది. ఆ విషయాల్లోకి వెళితే…
ఇటీవల నితిన్ నటించిన ‘రాబిన్ హడ్’ సినిమాలో వార్నర్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం వ్యాప్తి చెందగా, ఇప్పుడు నిర్మాత రవిశంకర్ ఈ వార్తను అధికారికంగా ధ్రువీకరించారు. హైదరాబాద్లో ఇటీవల జరిగిన ‘కింగ్‌స్టన్’ సినిమా ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో ఈ వివరాలు బహిర్గతమయ్యాయి.
Also Read: Sandeep Reddy Vanga: హీరో లేకుండా సినిమా తీస్తా..
David Warner: ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్, “సినిమాలో డేవిడ్ వార్నర్ కేమియో రోల్ లో కనిపిస్తారు. అతని పాత్ర ప్రేక్షకులకు ఎంతో ఎక్సైట్మెంట్ ను ఇస్తుంది అని అన్నారు. భారతీయ సినిమాకి అతనిని పరిచయం చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం అని పేర్కొన్నారు.
గత సంవత్సరం ఆస్ట్రేలియాలో జరిగిన ‘రాబిన్హుడ్’ చిత్రీకరణలో వార్నర్ భాగస్వామ్యాన్ని సూచించే కొన్ని స్టిల్స్ ముందే వెల్లడైయ్యాయి. అయితే ఆ సమయంలో టీమ్ ఈ వివరాలను వివరించలేదు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో, శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది.