Dates: డ్రై ఫ్రూట్స్‌లో రుచికి, పోషకాలకు ఖర్జూరం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది కేవలం తీపిగా ఉండటమే కాకుండా, మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజూ కేవలం రెండు ఖర్జూరాలు తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఆశ్చర్యపరుస్తాయి.
పోషకాల గని ఖర్జూరం:
ఖర్జూరంలో ముఖ్యంగా ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు, ఫినాలిక్ ఆసిడ్, కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఇది శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, గుండె సంబంధిత వాపులను నివారిస్తుంది. అంజీరా, బాదం వంటి ఇతర పండ్లతో పోలిస్తే, ఖర్జూరంలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు:
తక్షణ శక్తి: నీరసంగా అనిపించినప్పుడు ఒక్క ఖర్జూరం తిన్నా వెంటనే శక్తి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
గుండె ఆరోగ్యం: ప్రతిరోజూ ఖర్జూరం తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గుండెకు చాలా మంచివి.
మెరుగైన జీర్ణక్రియ: అధిక ఫైబర్ ఉండటం వల్ల ఖర్జూరాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ప్రేగు కదలికలను సులభతరం చేసి, మలబద్ధకాన్ని నివారిస్తాయి. కరిగే ఫైబర్ కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచి, ఆరోగ్యకరమైన గట్ సూక్ష్మజీవులను నిర్వహిస్తుంది.
రక్తహీనత నివారణ: ఖర్జూరంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా మంచిది. రోజూ ఖర్జూరం తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం వృద్ధి చెందుతుంది.
రక్తపోటు నియంత్రణ: దీనిలోని ఫైబర్, పొటాషియం, విటమిన్లు రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. బీపీ ఉన్నవారు ఖర్జూరం తినడం మంచిది.
Also Read: Diabetic Tips: నీకు షుగర్ ఉందా.. అయితే తేనె తినవచ్చా లేదా తెలుసుకో.. !
ఎముకల బలం: ఖర్జూరంలో ఉండే విటమిన్స్ ఎముకలకు బలాన్నిస్తాయి. రోజూ వీటిని తీసుకోవడం వల్ల ఎముకల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు: ఇతర ఆహారాలతో పోలిస్తే, ఖర్జూరాలకు తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు.
మెదడు పనితీరు: ఖర్జూరంలోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
బరువు నియంత్రణ: ఖర్జూరాలు బరువును అదుపులో ఉంచడంలో కూడా సహాయపడతాయి.
రోజూ రెండు ఖర్జూరాలు తినడం వల్ల అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షిస్తాయి, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. సంబంధిత విషయాలపై ఆసక్తి ఉన్న పాఠకుల కోసం అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ లోని అంశాలను ఫాలో అయ్యే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాల్సిందిగా మహా న్యూస్ సూచిస్తోంది.