Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా తనపై తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ దానం నాగేందర్ తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ తరఫున ఎంపీగా నామినేషన్ వేసిన నాటి నుంచే తన శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలని కోరుతూ ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేయగా, ఈ పిటిషన్ ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశముంది. అయితే తమ వాదనలు వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు లేదా స్టే ఇవ్వవద్దంటూ భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ ఇప్పటికే సుప్రీంకోర్టులో ముందస్తుగా కేవియట్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ న్యాయపోరాటం ఢిల్లీ వేదికగా మరింత ఉత్కంఠభరితంగా మారింది.
