Heavy Rains: తెలంగాణలో గత 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కొనసాగుతుండగా, వరదలతో సాధారణ జీవనం దెబ్బతింటోంది. ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
తెలంగాణలో వర్షాల పరిస్థితి
-
రెడ్ అలర్ట్ జిల్లాలు: ములుగు, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, మహబూబాబాద్
-
ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు: ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, ఆదిలాబాద్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట
-
ఎల్లో అలర్ట్ జిల్లాలు: మెదక్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, యాదాద్రి భువనగిరి
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని అధికారులు సూచించారు.
హైదరాబాద్‌లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఆదివారం నుంచి కురుస్తున్న వర్షాలు నగరాన్ని అల్లకల్లోలం చేశాయి. రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఫిలింనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట వంటి ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. GHMC, SDRF బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

