Crime News:హైదరాబాద్ దుర్గం చెరువు వద్ద మరో దారుణం చోటుచేసుకున్నది. కేబుల్ బ్రిడ్జి పైనుంచి దుర్గం చెరువులో దూకి సుష్మ (27) అనే యువతి ఆత్మహత్య చేసుకున్నది. బుధవారం ఆఫీసులో విధులకు వెళ్లిన సుష్మ రాత్రికి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆమె తండ్రి అంజయ్య, ఇతర కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మరునాడు పోలీసులు సుష్మ మృతదేహాన్ని కేబుల్ బ్రిడ్జి సమీపంలోని దుర్గం చెరువు నుంచి బయటకు తీసి గుర్తించారు. సుష్మ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
