Crime News: మెదక్ జిల్లాలో ఇటీవల ఓ మహిళా కూలీపై జరిగిన లైంగికదాడి ఘటనలో బాధ్యుడిని పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ కెమెరాల ద్వారా ఘటనకు సంబంధించిన విషయాలను పరిశీలించిన పోలీసులు, నిందితుడి ఆనవాళ్లను గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణ నిందితుడు తెలిపిన విషయాలు విస్తుగొలిపేలా ఉన్నా, ఆ దుండగుడి వల్ల ఓ నిండు ప్రాణం బలైంది. అది ఆ కుటుంబానికి పూడ్చలేని లోటుగా పలువురు భావిస్తున్నారు.
Crime News: మెదక్ జిల్లా జానకంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ తండా నుంచి ఒక మహిళా కూలీ కూలిపనుల కోసం మెదక్ జిల్లా కేంద్రానికి వెళ్లింది. కూలి పనులు ఉన్నాయంటూ వచ్చిన ఆ దుండుగుడు ఆమెను కొల్పారం మండలం అప్పాజిపల్లి సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. పలుమార్లు దాడి చేసి, ఆమెపై భౌతిక దాడికి దిగాడు. ఆమెను వివస్త్రను చేసి, అక్కడే ఓ చెట్టుకు తాళ్లతో బంధించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత స్థానికులు గుర్తించి, పోలీసులకు తెలుపగా, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలిడిసింది.
Crime News: ఈ అమానుషానికి పాల్పడింది ఫకీర్ నాయక్ అనే ఓ పాత నేరస్థుడిగా పోలీసులు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా అంబోజిగూడలో నివాసం ఉంటున్న సమయంలో ఓ మహిళను హత్యాచారం చేసిన కేసుతోపాటు మరో 7 కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నాడు. వాటిలో ఓ కేసులో అక్టోబర్ 13న తుది తీర్పు వస్తుందని, కోర్టు జీవిత ఖైదు విధిస్తుందని తెలిసి, తీలోగా తన కామవాంఛ తీర్చుకోవాలని ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడని పోలీసుల విచారణ తేలింది.
Crime News: కూలిపనులు ఇస్తానని నమ్మించిన ఫకీర్నాయక్.. ఆ మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ప్రతిఘటించిన ఆ మహిళపై దాడికి పాల్పడ్డాడు. రాత్రంతా ఆమెను చెట్టుకు కట్టేసి ఉంచాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న చర్చి వద్ద బట్టలు మార్చుకొని రాత్రంతా అక్కడే నిద్రించాడు. ఇవన్నీ చేసిన దుండగుడు ఫకీర్నాయక్ అని సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉన్నది. దీంతో అతడిని అరెస్టు చేసి విచారించగా, అసలు నిజాలు బయటకు వచ్చాయి.