Crime News: రోడ్డున భార్యాభర్తలు వెళ్తుంటే అందరూ గుమిగూడారు.. ఏమిటా తొంగి చూశారిద్దరూ.. ఓ పసికందును ఎవరో వదిలేసి వెళ్లారు.. అందరిలాగే ఆమె కూడా చలించింది.. ఇతరులంతా చూసి వెళ్తుంటే.. ఆ జంట మాత్రం అక్కడే నిలిచిపోయింది.. పిల్లలు లేని తమకు ఆ పసిగుడ్డుపై మమకారం పెరిగి ఇంటికి తెచ్చుకున్నారు.. పెంచి పెద్ద చేసుకున్నారు.. ఒడిశాలో జరిగిన ఆ ఘటనలో ఆ తర్వాత ఏం జరిగిందో.. వివరాలు తెలుసుకుందాం రండి..
Crime News: ఒడిశాలోని గజపతి జిల్లా పర్లాఖిముండి పట్టణంలో ఆ ఘటన వెలుగు చూసింది. రోడ్డున పడేసిన పాపను సమీపంలోని ఓ గ్రామంలో నివాసం ఉండే రాజ్యలక్ష్మి దంపతులు ఆ పసికందును తెచ్చి దత్తతు తీసుకొని పెంచుకున్నారు. అయితే ఆ పాపను తెచ్చుకున్న ఏడాదిన్నరకే రాజ్యలక్ష్మి భర్త కన్నుమూశారు. ఉన్న ఆ ఒక్కగానొక్క తోడే లోకంగా భావించిన రాజ్యలక్ష్మి ఆ బాలికను అల్లారుముద్దుగా పెంచుకోసాగింది.
Crime News: పాప పెద్దగైన కారణంగా చదువుల కోసం రాజ్యలక్ష్మి పర్లాఖిముండికి వచ్చి అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉన్నారు. ఈలోగా ఆ బాలిక కూడా పెరిగి పెద్దగై 8వ తరగతికి చేరింది. అల్లారు ముద్దుగా పెంచిన ఆ తల్లి ప్రేమను ఆసరా చేసుకున్న ఆ బాలిక ఆ వయసులోనే తోటి విద్యార్థులైన గణేశ్ రథ్ (21), దినేశ్ సాహు (20)తో సంబంధం పెట్టుకున్నది.
Crime News: ఈ విషయం రాజ్యలక్ష్మికి తెలియడంతో పెంపుడు కూతురును మందలించింది. అప్పటి వరకూ పువ్వుల్లో పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకున్న రాజ్యలక్ష్మి ఆ బాలికను మందలించడమే తప్పయింది. ఆ మందలింపుతో రాజ్యలక్ష్మిపై ఆ బాలిక కోపం పెంచుకున్నది. ఆ కోపం మరింతగా ముదిరి ఏకంగా ఆమెను చంపేయాలనే కసి పెంచుకున్నది. ఆమెను చంపితే ఆస్తికూడా తన సొంతం అవుతుందని భావించింది.
Crime News: రాజ్యలక్ష్మిని చంపేందుకు పెంపుడు కూతురు ప్లాన్ చేసింది. ఆమెను ఈ విషయంలో గణేశ్ రథ్ అనే బాలుడు కూడా ప్రేరేపించినట్టు తెలిసింది. దీంతో రోడ్డుపై అనాథలా మారిన పసికందును పెంచి పెద్ద చేసినందుకు రాజ్యలక్ష్మిని చంపే ప్లాన్ చేసింది. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసింది. ఈ లోగా ఆ ఇద్దరు బాలురును కూడా రప్పించింది. ముగ్గురూ కలిసి రాజ్యలక్ష్మి మొహంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు.
Crime News: ఆ తర్వాత అనారోగ్యంతో ఉన్నదని నటిస్తూ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారించడంతో ఇంటికి తీసుకొచ్చారు. గుండెనొప్పితో చనిపోయిందని నమ్మబలికారు. ఆమెకు అప్పటికే గుండెపోటు ఉండటంతో నిజమేనని బంధువులు కూడా నమ్మి భువనేశ్వర్‌లోని బంధువుల సమక్షంలోనే దహనకార్యక్రమాలు నిర్వహించారు.
Crime News: ఆ తర్వాత రాజ్యలక్ష్మి సోదరుడు శిబా ప్రసాద్ మిశ్రా ఆ బాలిక మొబైల్ ఫోన్‌లో చూడగా అసలు ప్లాన్ తెలిసింది. రాజ్యలక్ష్మి హత్యకు ప్లాన్ చేసుకున్న మెసేజ్‌లు కనిపించాయి. ఆ చాట్‌లోనే రాజ్యలక్ష్మిని చంపి, ఆమె బంగారు నగలు తీసుకెళ్లిన సమాచారం ఉన్నది. దీంతో ఆ ముగ్గురూ కలిసి రాజ్యలక్ష్మిని చంపారని నిర్ధారించుకున్న మిశ్రా పర్లాఖిముండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో రాజ్యలక్ష్మి పెంపుడు కూతురుతోపాటు ఆమె ఇద్దరు స్నేహితులను అరెస్టు చేశారు.