Crime News: మెదక్ జిల్లాలో మరో దారుణం చోటుచేసుకున్నది. తన ప్రియుడి కోసం కట్టుకున్న భర్త అడ్డు తొలగించుకోవాలని ఆ మహిళ అనుకున్నది. డబ్బులిచ్చి మరీ ఆ భర్తను కడతేర్చింది. తన భర్త కనిపించకుండా పోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి నాటలకానికి తెరతీసింది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చి ఇప్పుడు తన ప్రియుడితో కలిసి కటకటాలు లెక్కిస్తున్నది.
Crime News: మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం షమ్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీను భార్య లత, అదే గ్రామానికి చెందిన మల్లేశ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు మందలించాడు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించినా లత తన పద్ధతి మార్చుకోలేదు.
Crime News: తన వివాహేతర బంధానికి భర్త తరచూ అడ్డొస్తున్నాడని భావించింది లత. ఇక తన భర్త అడ్డు తొలగించుకుంటే తన ప్రియుడితో కలిసి ఎంచక్కా బతకొచ్చు అని ప్లాన్ చేసింది. అనుకున్నదే తడవుగా తన ప్రియుడు మల్లేశ్‌కు విషయం చెప్పింది. ఆ ఇద్దరూ కలిసి అదే గ్రామానికి చెందిన మలిశెట్టి మోహన్ అనే వ్యక్తిని సంప్రదించారు. తన భర్త శ్రీనును చంపాలని రూ.50 వేలను మోహన్‌కు లత, మల్లేశ్ కలిసి ఇచ్చారు.
Crime News: పథకం ప్రకారం.. మద్యం తాగేందుకని శ్రీనును మోహన్ అనంతసాగర్ గ్రామ శివారు వరకు తీసుకెళ్లాడు. ఎలాగైనా శ్రీనును మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. మద్యం తాగుతుండగానే మోహన్ తన ప్లాన్ ప్రకారం.. బీరు సీసాతో తలపై కొట్టి చంపేశాడు. ఎంచక్కా మోహన్ ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయాడు.
Crime News: ఈ సమయంలో లత నాటకానికి తెరతీసింది. తన భర్త కనిపించడం లేదంటూ గగ్గోలు పెట్టసాగింది. ఇరుగు పొరుగుకు కూడా చెప్పుకొని ఏడ్వసాగింది. ఆ తర్వాత రెండు రోజులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును తీసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. పోలీసుల విచారణ సమయంలో లత, ఆమె ప్రియుడిపై అనుమానం కలిగింది.
Crime News: ఈ సమయంలో తమదైన శైలిలో పోలీసులు లత, మల్లేశ్‌ను విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే తన ప్రియుడితో కలిసి మోహన్ ద్వారా భర్తను చంపినట్టు లత ఒప్పుకున్నది. ఆ తర్వాతే మిస్సింగ్ ఫిర్యాదు చేసినట్టు ఆమె తప్పును ఒప్పుకున్నది. దీంతో ఆ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.