Crime News: హైదరాబాద్ నగరంలో ఎప్పుడు, ఎక్కడ ఏం జరుగుతుందో అంతుబట్టదు. బతుకుదెరువు కోసం వచ్చిన వారిపై కొందరు అజమాయిషీ చేస్తుంటారు. ఇక్కడా అదే జరిగినట్టున్నది. ఓ రౌడీషీటర్ ఏకంగా 10 మంది తోపుడు బండ్ల యజమానులపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. అతనిపై ఆ తోపుడుబండ్ల వ్యాపారులు ఎదురుదాడి చేయడంతో ఆ రౌడీషీటర్‌కు గుణపాఠం చెప్పారు.
Crime News: కార్వాన్ ప్రాంతంలో తోపుడు బండ్లపై టిఫిన్ అమ్ముతున్న వారిపై రౌడీషీటర్ భరత్ వీరంగం సృష్టించాడు. తోపుడు బండ్లను ధ్వంసం చేసుకుంటూ వెళ్తుండగా, అడ్డువచ్చిన ఆ బండ్ల వ్యాపారులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ లోగా తోపుడుబండ్ల యజమానులంతా ఒక్కటయ్యారు. వారికి స్థానికులు తోడవడంతో రౌడీషీటర్‌ను చితకబాదారు. రౌడీషీటర్ వెంట ఉన్న స్నేహితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
Crime News: స్థానికులు, తోపుడుబండ్ల వ్యాపారుల దాడిలో రౌడీషీటర్ భరత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటన జరిగిన చోటే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆ రౌడీషీటర్ భరత్‌పై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో పలు కేసులు నమోదై ఉన్నాయి. పట్టపగలే ఓ మెడికల్ షాపుపై దాడి చేయగా, ఆ షాప్ మొత్తం ధ్వసం కాగా పరారైన కేసు ఉన్నది.

