Crime News: యువకులు ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ కొందరు అకస్మాత్తు ప్రమాదాలకు గురై చనిపోతూ ఉన్నారు. దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. అలాంటి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ మనదేశంలోనే హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువకుడు ప్రాణాలను బలి తీసుకున్నాడు.
Crime News: హిమాచల్ ప్రదేశ్‌లో ఇంద్రునాగ్లో సతీశ్ (25) అనే యువకుడు పారాగ్లైడర్‌పై గాలిలో తేలియాడేందుకు సిద్ధమయ్యాడు. టేకాఫ్ సైట్లోనే పారాగ్లైడర్ లేవలేకపోయింది. కొండ కింది ప్రదేశంలో అది కూలిపోవడంతో టూరిస్టు సతీశ్‌తోపాటు పైలట్ సూరజ్‌కు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ టూరిస్టు సతీశ్ చనిపోయాడు.
Crime News: ఇదే ఘటనా స్థలంలో టేకాఫ్ సమయంలోనే గ్లైడర్ కూలిపోవడంతో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు చెందిన భావ్సర్ ఖుషీ (19) అనే యువతి చనిపోయింది. ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు టూరిస్టులు చనిపోవడంతో సెప్టెంబర్ 15 వరకు పారాగ్లైడింగ్‌పై అక్కడి డిప్యూటీ కమిషనర్ నిషేధాన్ని విధిస్తూ ఆదేశాలను జారీ చేశారు.