Crime News: ఇటీవల సహజీవనం జంటలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీలలో ఆ సంస్కృతి మితిమీరుతున్నది. ఇంకా ముందుకెళ్తే ఐటీ రంగంలో పనిచేసే యువతీ, వయుకుల జంటలు ఇలాంటి సహజీవనానికి అలవాటు పడుతున్నారు. ఇలాంటి ఎన్నో జంటల మధ్య వివిధ రూపాల్లో ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడా అదే జరిగింది. యువతితో సహజీవనం చేస్తున్న ఆ యువకుడిలో పశు ప్రవృత్తి ప్రవేశించి, ఆ యువతిని దారుణంగా హతమార్చేదాకా దారితీసింది. ఆ విషయాలేమిటో తెలుసుకుందాం రండి.
Crime News: మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరమైన భోపాల్‌లో రితికా సేన్ (29) అనే యువతితో సచిన్ రాజ్‌పుత్ (32) అనే యువకుడు గత నాలుగేండ్లుగా సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఇద్దరూ కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేశాక.. సచిన్‌కు ఉద్యోగం పోయింది. రితికా ఒక్కతే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది.
Crime News: ఊకున్నోడికి ఉపాయాలు ఎక్కువ, ఖాళీగా ఉన్నోడు కహనీలెన్నో చెప్తాడు.. అన్నట్టు ఇక్కడా అదే జరిగింది. ఎంచక్కా తన తోడుకు ఉద్యోగం లేకున్నా తానొక్కతే కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇద్దరూ ఎంచక్కా జీవనం గడుపుతున్నారు. పనీపాటా లేకుండా ఉన్న సచిన్ రాజ్‌పుత్‌లో ఓ అనుమానం రేకెత్తింది.
Crime News: రితికా సేన్ ఆమె పనిచేసే కంపెనీలో ఇతరులతో సంబంధం పెట్టుకున్నదన్న అనుమానం సచిన్‌లో పెనుభూతమైంది. తరచూ అనుమానించేవాడు. ఇదే విషయమై తరచూ గొడవ పడేవారు. ఇదే విషయంలో గత నెల (జూన్) 27న కూడా వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం మరింతగా ముదిరి సచిన్‌లో రాక్షసుడు ప్రవేశించాడు. ఆమె గొంతునులిమి చంపేశాడు.
Crime News: భయంతోనే, అపరాధ భారంతోనో కానీ, హత్య చేశాననే విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయాడు. రితికా సేన్ మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి బెడ్‌పై పడేశాడు. రెండు రోజుల పాటు పూటుగా మద్యం సేవిస్తూ ఆ మృతదేహం పక్కనే సచిన్ నిద్రించాడు. హత్య విషయం బయటకు పొక్కలేదు. ఎవరికీ తెలియలేదు.
Crime News: రెండు రోజుల తర్వాత (జూన్ 29న) మద్యం మత్తులో తన లివింగ్ పార్టనర్‌ను హత్య చేసిన విషయాన్ని తన స్నేహితుడు అనూజ్ అనే వ్యక్తికి సచిన్ చెప్పాడు. దీంతో హత్య విషయాన్ని మరునాడు పోలీసులకు అనూజ్ ఫిర్యాదు చేశాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, నిందితుడైన సచిన్‌ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.
Crime News: ఇక్కడ సచిన్ అనే యువకుడు రితికాసేన్కు తాళికట్టిన భర్త కాదు.. బంధువూ కాదు.. ఒక బాధ్యతా లేదు.. ఒక ప్రేమ అంటే అది కూడా శాశ్వతంగా కాదని తేలిపోయింది. అది కపట ప్రేమేనని రుజువైంది. మరి ఏమిటి.. ఈ బంధానికి ఉన్న విలువ ఏమిటి? ఇది పరాయి సంస్కృతి మనకు అంత మంచిది కాదని తేలిపోయింది. ఇలాగే సహజీవనం చేసేవారుంటే తగు జాగ్రత్తలు పాటించాలి. లేదంటే వివాహ బంధంతో ఒక్కటై భార్యాభర్తలుగా సమాజాంలో గుర్తింపు పొంది హాయిగా జీవించాలని మానసిక విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.

