Crime News: హైదరాబాద్ మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కిలాడి లేడీ హైకోర్టు జడ్జి అవతారం ఎత్తి ఎన్నో మోసాలకు పాల్పడింది. ఉద్యోగాల పేరుతో పలువురిని మోసాలకు గురి చేసింది. ఎక్కడికెళ్లినా హైకోర్టు జడ్జినంటూ ఆతిథ్యం స్వీకరించింది. చివరికి కరీంనగర్ జిల్లాలో మధురానగర్ పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కించనన్నది.
Crime News: ఆ కిలాడి లేడీ అయిన ఆ మహిళ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సుమారు 100 మందికి పైగా మోసం చేసినట్టు తెలుస్తున్నది. వారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిందని ఫిర్యాదులు అందాయి. హైకోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలంటూ ఎందరినో ఆ లేడీ బురిడీ కొట్టించినట్టు ఆరోపణలు వచ్చాయి.
Crime News: తాను జడ్జినంటూ వేముల వాడ దేవాలయంలో ప్రత్యేక దర్శనం చేయించుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు అక్కడి సీఐని బురిడీ కొట్టించింది. ఆయా ఫిర్యాదులపై ఆమెపై పలు కేసులు నమోదుయ్యాయి. మధురానగర్ పోలీసులకు అందిన సమాచారం మేరకు కరీంనగర్ జిల్లాలో ఆమెను పట్టుకొని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు తెలిసింది. దర్యాప్తు అనంతరం మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నది.