Crime News: కర్ణాటక రాష్ట్రంలోని రాజధాని అయిన బెంగళూరు నగరంలో అమానుష ఘటన చోటుచేసుకున్నది. ఓ తెలుగు మహిళపై ఓ దుకాణ యజమాని తీవ్రంగా దాడి చేసి, దౌర్జన్యం ప్రదర్శించాడు. మహిళ అని కూడా చూడకుండా నడిరోడ్డుపైనే ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనను స్తానికులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్గా మారింది.
Crime News: బెంగళూరులోని అవెన్యూ రోడ్డులో ఉన్న మియా సిల్క్ శారీస్ అనే దుకాణంలో రూ.91,500 విలువ గల చీరలను దొంగిలించిందని, రోడ్డుపై అటుగా వెళ్తున్న యాజమాని, సిబ్బందితో కలిసి ఆమెపై దాడికి దిగాడు. రోడ్డుపైకి లాక్కొచ్చి దారుణంగా విచక్షణారహితంగా వారంతా కలిసి దాడి చేశారు. దీంతో ఆమె తనకేమీ తెలియదంటూ వేడుకుంటున్నా, ఆగకుండా తన్నుతూ, కొడుతూ ఈడ్చుకెళ్లి దారుణంగా కొట్టారు.